CASUAL LEAVE RULES
సాధారణ సెలవు -నియమ నిబంధనలు*
*(CASUAL LEAVE RULES)*
💢ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది .
ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు.
ప్రతి క్యాలెండర్ సం॥ కి 15 చొప్పున మంజూరు చేయబడతాయి. *(G.O.Ms.No.52 Dt:04-02-1981)*
సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు.*(G.O.Ms.No.2465 Fin Dt:23-12-1959)* *(G.O.Ms.No.2094 Fin Dt:22-04-1960)*
ఒక క్యాలెండర్ సం॥ లో 5 ఆప్షనల్ హాలిడేస్ ను,3 లోకల్ హాలిడేస్ ను వినియోగించుకోవచ్చును.లోకల్ హాలిడేస్ అకాడమిక్ సం॥ వాడుకోవాలి. *(G.O.Ms.No.1205 Edn Dt:23-10-1981)*
సెలవు నియమావళి ప్రకారం అర్ధజీత, సంపాదిత, జీతనష్టపు సెలవుతో గాని,జాయినింగ్ కాలంతో గాని,వెకేషన్ తో గాని సాధారణ సెలవును జతపరుచుటకు వీలులేదు.
సెలవు అనేది హక్కుగా పరిగణించరాదు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంజూరుచేసే అధికారికి ఏ రకమైన సెలవునైనా సహేతుక కారణాలతో నిరాకరించుటకు లేదా మధ్యలోనే రద్దుచేయుటకు విచక్షణాధికారం ఉంటుంది- *FR-67*
అర్ధ రోజునకు కూడా సాధారణ సెలవు మంజూరు చేయవచ్చును.అయితే ఒంటిపూట బడుల విషయంలో వీలుపడదు. *(G.O.Ms.No.112 Fin Dt:03-06-1966)*
విధినిర్వాహణ ద్వారా మాత్రమే సెలవు సంపాదించబడుతుంది *FR-60*
సెలవు లేకుండా డ్యూటీకి గైర్హాజరు కారాదు. నిబంధనల ప్రకారం సెలవు గాని,పర్మిషన్ గాని ముందస్తు అనుమతితోనే వినియోగించుకోవాలి.ఎట్టి దరఖాస్తు పంపనపుడు ప్రధానోపాధ్యాయుడు *గర్హాజరును* హాజరు పట్టికలో నమోదు చేయవచ్చును-*A.P.E.R Rule-155*
Leave a Reply
You must be logged in to post a comment.
hi