skip to Main Content
WISHING YOU ALL A HAPPY NEW YEAR - 2024
Medical Invalidation

Medical Invalidation

 మెడికల్ ఇన్వాలిడేషన్ 

1.అనారోగ్య కారణంగా పదవీ విరమణ పొందు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు కనీసం 5 సంవత్సరాల సర్వీసు కలిగియుండి, ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారము లేని తీవ్ర,దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినచో నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకము చేస్తారు.

(G.O.Ms.NO.504,GAD తేది:30-4-1980)

(G.O.Ms.NO.309,GAD తేది:04-07-1985)

(A.P Pension code volume-I,Article-441)
❇ తదుపరి ఒక కేసులో రాష్ట్ర ఉన్నతస్థాయి న్యాయస్థానం అట్టి కారుణ్య నియమకాలు రాజ్యంగ విరుద్దమని తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ పై కారుణ్య నియామకాల పద్దతిని రద్దుపరచింది.

❇ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు ప్రభుత్వం మరలా మెడికల్ ఇన్వాలిడేషన్ పై  ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్దతిని మరలా పునరుద్దరించింది.(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)

ఎవరు అర్హులు: 

కుటుంబ సభ్యులు అనగా AP Revised Pension Rules 1980 లోని రూలు 50(12B)లో నిర్దేశించిన వారై ఉండాలి.

❇ భార్య/భర్త, కుమారులు, కూతుళ్ళు, చట్టరీత్యా దత్తత తీసుకున్న కుమారుడు/కూతురు, అట్టి దత్తత రిటైర్మెంటుకు ముందుగా తీసుకునియుండాలి.

❇అవివాహిత కూతురు,విధవరాలైనకూతురు,విడాకులు పొందిన కూతురు.

మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు

❇ మెడికల్ ఇన్వాలిడేషన్  కోరు ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.

❇ సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సుల నిమిత్తం పంపబడుతుంది.

❇ జూనియర్ అసిస్టెంట్, తత్సమానమైన పోస్టు అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు.

(G.O.Ms.No.35 తేది:10-04-2000)

❇మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఉద్యోగి రిటైరైన తేదినుంచి ఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

❇ నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, అభ్యర్ధికి సంబంధించిన అన్ని వివరములు ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి.

❇ మెడికల్ బోర్డు నివేదిక  అందిన తర్వాత ఉద్యోగిని  నియామక అధికారి జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్ధం పంపాలి.

జిలాస్థాయి కమిటీ:

1.జిల్లా కలెక్టర్-అధ్యక్షుడు (CHAIRMAN)

2.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి-సభ్యుడు

3.సంబంధిత జిల్లా శాఖ అధికారి-సభ్యుడు/కన్వీనర్

❇ శాఖధిపతి(Head of the Department)కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు/సెక్రటేరియేట్ శాఖాలలో

పనిచేయు ఉద్యోగుల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది

❇ మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం క్రింద, కారుణ్య నియామకాలు, యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 % మించకూడదు.

❇భార్య,భర్తలిరువురు ఉద్యోగులైన సందర్భములో కారుణ్య నియామకానికి అవకాశము లేదు.

❇ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేసారు. మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణాలపై) వైద్య ధ్రువపత్రము ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్, కమ్యూటేషన్ అవకాశములేదు.

మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలిడు పింఛను ఇస్తారు.

❇ ఏ జబ్బుల వల్లమెడికల్ ఇన్వాలిడేషన్ పై  రిటైరు కావచ్చు:

క్రింద తెలిపిన ఏదేని జబ్బులతో రోగపీడితులుగా ఉన్న ఉద్యోగిమెడికల్ ఇన్వాలిడేషన్ పై మెడికల్ బోర్డు నిర్థారణ సర్టిఫికేట్ ఆధారంగా, మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైరు కావచ్చును.

1.పక్షవాతము (PARALYSIS):
A)నాలుగు అవయవములు – కాళ్ళు,చేతులు

B)ఒకవైపు పై భాగము లేదా,క్రింది భాగము

C)క్రింది భాగము రెండు అవయవములు లేదా/అంగములు

2.అంతిమదశలో ఉన్న మూత్రపిండముల రోగము(END STAGE RENAL DISEASE)

3.అంతిమదశలో ఉన్న కాలేయ రోగము(END STAGE LEVER DISEASE)

4.క్యాన్సరు(CANCER WITH METASTASIS STAGE OR SECONDARIES)

5.మానసిక సంబంధితము(DEMENTIA-MENTAL DISORDER)

6.తీవ్రమైన పార్కిన్సన్ జబ్బు (SEVERE PARKINSON DISEASE)

మెడికల్ ఇన్వాలిడేషన్  విషయంలో కమిటీకి పంపవలసిన వివరములు (GOVT MEMO.NO.10054/K2/2009 తేది:05-09-2009)

1.మెడికల్ ఇన్వాలిడేషన్ కోరు ఉద్యోగి పేరు:

2.ఉద్యోగి పనిచేస్తున్న శాఖ – హోదా – జీతపు స్కేలు:

3.ఏదైనా క్రమశిక్షణా చర్యలు అపరిష్క్రుతంగాఉన్నాయా:

4.ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా:

5.సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది:

6.వాస్తవంగా కాలపరిమితిమేరకు పదవీవిరమణ చేయు తేది:

7.రోగ వివరములు:

This Post Has 0 Comments

Leave a Reply

Back To Top